బిడది టౌన్‌షిప్‌తో రైతులకు మోసం | - | Sakshi
Sakshi News home page

బిడది టౌన్‌షిప్‌తో రైతులకు మోసం

Jun 15 2026 4:16 AM | Updated on Jun 15 2026 4:16 AM

మండ్య: బిడది టౌన్‌షిప్‌ పథకం ఒక ప్రభుత్వ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌. ఇది పూర్తిగా డబ్బు దోచుకోవడానికి వేసిన పథకం అని కేంద్ర మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆదివారం మండ్యలో విలేకరులతో మాట్లాడుతూ, బిడది టౌన్‌షిప్‌ దేశ ప్రయోజనాలకు మంచిది కాదు, దీనిని భూ మాఫియా, భూ దోపిడీదారులకు లబ్ధి చేకూర్చేలా రూపొందించారని అన్నారు. బ్రాండ్‌ బెంగళూరు అంటున్నారు, రోడ్లపై గుంతలు ఉన్నాయి, ట్రాఫిక్‌ కష్టంగా ఉంది, వాటిని సరిచేయకుండా బిడది రైతుల జీవితాలను తగలబెట్టడానికి వెళుతోందని సర్కారుపై మండిపడ్డారు. రైతుల భూములను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రైతులకు తాను అండగా నిలబడి న్యాయపోరాటం చేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో ఆర్కావతి సెటిల్మెంట్‌ కోసం సుమారు మూడు వేల ఎకరాల భూమిని నోటిఫై చేసిందని, ఆ తర్వాత వెయ్యి ఎకరాల భూమిని వదిలేసిందని విమర్శించారు.

ప్రధాని, సీఎం ఏం మాట్లాడారో?

బిడదిలో తోటలు ఉన్నాయి, పాడి పరిశ్రమ ఉంది, అలాంటి చోట టౌన్‌షిప్‌ వద్దని కుమార అన్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని, ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వారు ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు, అయితే, రాష్ట్ర రైతుల ప్రయోజనాలను బలిపెట్టడానికి సీఎం ప్రధానమంత్రి పేరును దుర్వినియోగం చేయకూడదు అని చెప్పారు.

అదో పెద్ద కుంభకోణం

కేంద్రమంత్రి కుమారస్వామి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement