ఫీజు గొడవ.. విద్యార్థిని బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ఫీజు గొడవ.. విద్యార్థిని బలవన్మరణం

Jun 14 2026 11:49 AM | Updated on Jun 14 2026 11:49 AM

యశవంతపుర: కాలేజీలో ఫీజు కట్టడానికి తండ్రి ఇచ్చిన డబ్బులను తెలిసిన వ్యక్తికి ఇచ్చింది, తరువాత అతడు ఇవ్వకపోవడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఉత్తరకన్నడ జిల్లా భట్కళ తాలూకా బెళకె గ్రామంలో జరిగింది. భట్కళలో బీసీఎ చదువుతున్న గాయత్రి (20)కి ఫీజు కట్టడానికి తండ్రి నాగరాజు నాయక రూ.10 వేలు ఇచ్చాడు. ఆమె తన స్నేహితుడు సంతోష నాయకకు ఆ డబ్బు ఇచ్చింది. ఫీజు కట్టే సమయం వచ్చింది, తిరిగి ఇవ్వాలని కోరగా సంతోష తన వద్ద లేవని చెప్పాడు. ఫీజు కట్టలేకపోవడంతో హాల్‌ టికెట్‌ మంజూరు కాలేదు. ఇది ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందని భయపడిన ఆమె బావిలోకి దూకి ప్రాణాలు తీసుకుంది. భట్కళ గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement