పిల్ల పులి కోసం గాలింపు | - | Sakshi
Sakshi News home page

పిల్ల పులి కోసం గాలింపు

Jun 14 2026 11:49 AM | Updated on Jun 14 2026 11:49 AM

యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా ముళ్లయ్యనగిరి ప్రాంతంలో వల చుట్టుకున్న ఓ పులి పిల్ల తిరుగాడుతోంది. పరిసర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండగా అటవీశాఖ అధికారులు తెలిపారు. అడవిలోని సీసీ కెమెరాల ద్వారా పులి చిత్రాలు లభించాయి. పులి నడుం వరకు వల చిక్కుకుంది. గాయాలైన ఆ పులిని నాలుగైదు రోజుల కింద అటవీ సిబ్బంది గుర్తించారు. అది జింకను కూడా వేటాడి తిన్నది. దానిని బంధించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. పండరవళ్లి, కొళగామె, ఏళునూరుఖాన్‌ గ్రామాల్లో గుబులు నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement