బిడది టౌన్‌షిప్‌ అవసరం | - | Sakshi
Sakshi News home page

బిడది టౌన్‌షిప్‌ అవసరం

Jun 14 2026 11:49 AM | Updated on Jun 14 2026 11:49 AM

ఎరువుల కొరత రానీయొద్దు

రాష్ట్రంలో వ్యవసాయ సీజన్‌ మొదలైందని, రసాయనిక ఎరువులు, విత్తనాల కొరత రాకుండా జాగ్రత్తలు వహించాలని సీఎం శివ తెలిపారు. ఎరువుల విషయంలో శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండగా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. రాష్ట్రంలో కొన్ని జలాశయాల్లో నీటి కొరత నెలకొంది. అందుచేత తాగునీరు సమస్య కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

బనశంకరి: కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామి మార్గదర్శనం ప్రకారం బిడది టౌన్‌షిప్‌ పథకాన్ని కొనసాగిస్తామని సీఎం డీకే.శివకుమార్‌ తెలిపారు. బిడది టౌన్‌షిప్‌ గురించి ఢిల్లీలో ప్రధాని మోదీకి వివరించానని, ఆయన సమ్మతం తెలిపారని అన్నారు. బెంగళూరుపై జనం ఒత్తిడి అధికంగా ఉందని, అందుకే టౌన్‌షిప్‌ కావాలన్నారు.

అవినీతి ఉండకూడదు

కర్ణాటక అవినీతి రహితం కావాలని, ఎవరూ రూపాయి కూడా లంచం ఇవ్వకూడదనేది తన ఆశయమని తెలిపారు. మేము తప్పుగా చెప్పినప్పటికీ, మీరు అలా చేయరాదని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకురాకూడని తెలిపారు. ప్రతికార్యాలయంలో అధికారుల పేరు, ఫోన్‌ నంబరుతో బోర్డు ఏర్పాటుచేయాలన్నారు. లంచం అడిగితే ఈ నంబరుకు ఫిర్యాదు చేయాలనే వ్యవస్థను తీసుకు వస్తానన్నారు. ఒకేసారి అవినీతి నిర్మూలన సాధ్యం కాదని, ప్రయత్నిస్తూ ఉండాలని తెలిపారు.

ఆ లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాలి

గృహ లక్ష్మీ, గృహ జ్యోతి పథకాల అర్హులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సీఎం డీకే.శివకుమార్‌ తెలిపారు. సమీప కార్యాలయాల్లో దరఖాస్తులను అందించాలన్నారు. ఉదయం 10 గంటలకు అధికారులు ఆఫీసులకు హాజరు కావాలన్నారు. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ప్రారంభమౌతుందని, ఓటు కాపాడుకోవడానికి దరఖాస్తు నింపి, బీఎల్‌ఓలకు ఇవ్వాలని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement