రాయచూరు రూరల్: దేశానికి బంగారాన్ని ఉత్పత్తి చేసే హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. శనివారం హట్టి బంగారు గనుల కంపెనీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు చంద్రశేఖర్ మాట్లాడారు. వేతన ఒప్పందం, ఆహార కిట్ల పంపిణీ, హెచ్‌ఆర్‌ఏ, ఎక్స్‌గ్రేషియా, 2025–26వ సంవత్సర బకాయి వేతనాలు చెల్లించాలని, రిటైర్డ్ పథకాన్ని జారీ చేయాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. అర గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. వెంకోబ గౌస్, జమదగ్ని, రమేష్, బాబు, హనుమంతు, మునీర్, సాగర్, సంగయ్య, రాజేశ్వరి, వెంకటేష్‌లున్నారు.


