రాయచూరు రూరల్: ఏడాది పాటు స్తంభించిన విమాన ప్రయాణాలను కలబుర్గిలో పునరుద్ధరించారు. కలబుర్గి నుంచి బెంగళూరుకు బుధవారం సాయంత్రం కలబుర్గి– బెంగళూరు విమాన సేవలను కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి సహకారంతో కర్ణాటక పట్టు పరిశ్రమ అభివృద్ధి మండలి అధ్యక్షురాలు ఖనీజా ఫాతిమా ప్రారంభించారు. బెంగళూరు నుంచి 76 సీట్లున్న ఈ స్టార్ ఎయిర్ విమానం కలబుర్గికి ప్రయాణిస్తుందని అధికారి బోపణ్ణ తెలిపారు. శాసన సభ్యుడు ఎం.వై.పాటిల్, జిల్లాధికారి ఇక్రంపాషా, ఎస్పీ శ్రీనివాసులు, అధికారులున్నారు.


