హొసపేటె: కళ్యాణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని లక్షలాది రైతులకు జీవనాధారమైన తుంగభద్ర డ్యాం రుతుపవన వర్షాల ప్రారంభంతో కొత్త వరదను సంతరించుకుంది. తీవ్రమైన వేసవి కారణంగా ఎండిపోయి డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరిన ఈ జలాశయం ఇప్పుడు పరివాహక ప్రాంతాలైన శివమొగ్గ, శృంగేరి, మొరాళు, ఆగుంబె, తీర్థహళ్లి తదితర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. టీబీ డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 101 టీఎంసీలు కాగా, ప్రస్తుతం డ్యాంలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రుతుపవన వర్షాలు ఇదే విధంగా కొనసాగితే, ఈ ఏడాది నిర్ణీత సమయానికంటే ముందే జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉంది. గత ఏడాది తీవ్ర కరువు కారణంగా డ్యాం నిండకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈసారి రుతుపవనాల ప్రారంభంలో జలాశయం నీటితో నిండడం కళ్యాణ కర్ణాటకలోని కొప్పళ, బళ్లారి, రాయచూరు, విజయనగర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంత రైతులకు హర్షం కల్గించింది.
తుంగభద్ర డ్యాం నీరే జీవనాధారం
కళ్యాణ కర్ణాటక రైతుల్లో ఆనందం


