సాక్షి,బళ్లారి: గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. నగరంలోని బీజేపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలకు గోరింటాకు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ అరుణ తన చేతిపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని వేసుకుని ప్రధానిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కర్ణాటక రెడ్డి జన సంఽఘం ప్రముఖులు గణపాల్ ఐనాథరెడ్డి, ఓఎంసీ డైరెక్టర్ బీ.వీ.శ్రీనివాసరెడ్డి, అభిమానులు అరుణకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల్లో పోటీకి సిద్ధం
వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను బళ్లారి సిటీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని గాలి లక్ష్మీ అరుణ చెప్పారు. బళ్లారి సిటీ నియోజకవర్గం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే కచ్చితంగా తాను పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. ఒకవేళ తమ బావ గాలి సోమశేఖరరెడ్డికి పార్టీ టికెట్ కేటాయిస్తే ఐకమత్యంగా గెలిపించుకుంటామన్నారు. కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని చెప్పారు.


