రాయచూరు రూరల్: ఖరీఫ్ సీజన్‌లో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ సూచించారు. తన కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాల పంపిణీపై జాగృతి జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌లో ముందుగానే వానలు కురిసినందున, రైతులకు ఎలాంటి విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే సబ్సిడీ పథకాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖాధికారిణి దీపా, నేతలు శ్రీనివాస్‌రెడ్డి, మల్లికార్జునగౌడ, బసవరాజ్, నాగేంద్రప్ప, బషీరుద్దీన్‌లున్నారు.


