హుబ్లీ: దళిత కోటాలో తనకు నూటికి నూరు శాతం మంత్రి పదవి లభించే విశ్వాసం ఉందని, తనకు తప్పకుండా ఈ అవకాశం లభిస్తుందని స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ తర్వాత రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా గత 30 ఏళ్ల నుంచి కిత్తూరు కర్ణాటక భాగంలోని దళిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వలేదని, దీంతో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఈ ప్రాంతంలో శంకరానంద కుమారుడు ఓం ప్రకాష్ తర్వాత ఇప్పటి వరకు సుమారు 30–32 ఏళ్ల నుంచి ఎవరూ కూడా తమ సమాజానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. దీంతో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని ముఖ్యంగా తాను ఇక్కడి స్థానికుడు అయినందు వల్ల తనకు అవకాశం ఇస్తే ఎక్కువగా పని చేయడానికి అనుకూలం అవుతుందన్న కారణంగా మంత్రి పదవి ఇవ్వాలని అగ్రనేతలకు, పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశానన్నారు. స్థానికులకు మంత్రి పదవి ఇస్తే జిల్లా అభివృద్ధికి అనుకూలం అవుతుందన్నారు.
ఉత్తర కర్ణాటకకు కూడా ఛాన్స్ ఇవ్వాలి
కేవలం దక్షిణ భాగానికి ప్రాధాన్యత ఇస్తే చాలదు. ఉత్తర కర్ణాటకకు కూడా అవకాశం కల్పించాలి. ఈ భాగానికి రాజకీయ శక్తి నింపాలంటే మనం కూడా ఆర్గనైజ్డ్‌గా జాతీయ స్థాయిలో పార్టీని సంఘటితం చేయాలంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఇంకా మరింత గట్టిగా ఎగరాలని, తనలాంటి వారికి అవకాశం కల్పించాలని హైకమాండ్‌కు విన్నవించాను. దీని వల్ల కాంగ్రెస్ బలోపేతానికి దోహదపడుతుందన్నారు. బెంగళూరు మినహా హుబ్లీ రెండో ప్రముఖ కేంద్రం. ఇది కేవలం నోటి మాటలతో చెబితే చాలదు. దీంతో ఈ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, తమ సమాజం కాంగ్రెస్ పరంగా ఓటు వేస్తుంది. అందుకని తమ సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో ఎటువంటి భేద అభిప్రాయాలు లేవు. సాధారణంగా చిన్నా చితకా అభిప్రాయ భేదాలు ఉంటాయి. తమది పెద్ద పార్టీ. వారి వారి అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఈ విషయమై ఇప్పటికే హైకమాండ్‌లో చర్చ జరిగింది. ఏ ఇబ్బంది లేదు, సరిపోతాయి. కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీ పేర్కొంది. 60 ఏళ్ల లోపు వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనపై మంతనాలు జరుగుతున్నాయన్నారు.
మంత్రిగిరీ కోసం బసనగౌడ పావులు
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని డీకే శివకుమార్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలో మతివిడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వదంతుల నేపథ్యంలో జిల్లాలోని శాసన సభ్యులు మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తున్నారు. సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, రాయచూరు గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, విధాన పరిషత్ సభ్యులు బసనగౌడ బాదర్లి, శరణేగౌడ, వసంత్ కుమార్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఈనెల 20 తరువాత న్యూఢిల్లీకి రావాలని ఆదేశించిన నేపథ్యంలో పాత వారిని వదిలి కొత్త వారికి అవకాశాలకు తోడు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చి చెప్పడంతో డీ.కే. శివకుమార్ కేబినెట్‌లో ఎమ్మెల్సీ బసనగౌడ బాదర్లి పేరు రేసులో ముందంజలో వినబడుతోంది.
దళిత కోటాలో మంత్రి పదవి లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం
కేబినెట్‌లో యువతకు చోటు
కల్పిస్తారని ఎమ్మెల్సీ ఎదురు చూపు


