పలుచోట్ల జోరు వాన | - | Sakshi
Sakshi News home page

పలుచోట్ల జోరు వాన

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

దొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లా బైలహొంగల పట్టణంలో సోమవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. తగ్గు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వాననీరు, ముగురునీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. నగరసభ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ యూట్యూబర్‌ ఈశ్వర్‌ శిల్లేదార్‌ నీటి ప్రవాహంలో 3 గంటలపాటు నిరసన వ్యక్తం చేశాడు. డ్రైనేజీలను శుభ్రం చేయడం లేదని ఆరోపించాడు. నగరసభ కమిషనర్‌ భాగ్యశ్రీ హుగ్గి వచ్చి క్లీన్‌ చేయిస్తామని చెప్పడంతో ధర్నా విరమించాడు. మరోవైపు హుబ్లీ, ధార్వాడ నగరాల్లోనూ జోరు వాన కురిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement