శోభాయాత్ర కోలాహలం
మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మైసూరులోని నంజనగూడు పట్టణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు శోభాయమానంగా జరిగాయి. ప్రసిద్ధ శ్రీకంఠేశ్వర స్వామి ఆలయం ముందు వేడుకలను సిద్దలింగస్వామి, ఇమ్మడి మురుగ స్వామి, పట్టాడ నాగరాజ స్వామి తదితరులు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బి. హర్షవర్ధన్ మాట్లాడుతూ, హనుమాన్ జయంతి యువత సౌభ్రాతృత్వానికి, స్వేచ్ఛకు ప్రతీక అని అన్నారు. హనుమాన్ విగ్రహ ఊరేగింపు ఆరంభం కాగా 38 జానపద కళా బృందాల ప్రదర్శనలతో ఆర్భాటంగా సాగింది. వేలాది మంది హిందూ కార్యకర్తలు పాల్గొని ’జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. కాషాయ జెండాలు రెపరెపలాడాయి. వందలాది మంది యువకులు వీర హనుమంతున్ని కీర్తిస్తూ పాటలు పాడుతూ చిందులేశారు. అవాంఛనీయాలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటైంది.


