రాయచూరు రూరల్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో కన్నడ భాష ఉనికిని కాపాడదామని కలబుర్గి సీనియర్ కవి గవిసిద్దప్ప పేర్కొన్నారు. ఆదివారం కన్నడ భవనంలో కసాప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కన్నడ భాషాభివృద్ధికి కవులు చేసిన సేవలను కొనియాడారు. కన్నడ నాడు, నీరు, సాహిత్యం, సంస్కృతిని పెంపొందించడంలో శ్రమించాలన్నారు. కన్నడ సాహిత్య అభివృద్ధికి దాతలు ముందుకొస్తే కన్నడ భాషకు మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో లక్ష్మిదేవి శాస్త్రి, రాఘవేంద్ర కుష్టిగి, తాలూకా అధ్యక్షుడు వెంకటేష్, రావుత్ రావ్, రామణ్ణ హవళే, వీర హనుమాన్, దండెప్ప, ప్రతిభ, విజయరాజ్, మీనాక్షి ఖండిమఠ్‌్‌లున్నారు.


