చల్లని మమతల చినుకుల్లారా...
వెచ్చని సమతల బుడుగుల్లారా
పదర పదర పదరా...
బడులకు కదం తొక్కి పదరా...
అక్షరమే అందాల హారం
విద్యయే జీవిత సారం
పదర పదర పదరా...
బడులకు కదం తొక్కి పదరా...
గురువు మాటలే గంగాజలం
చదువు బాటలే బంగారు ఫలం
పదర పదర పదరా...
బడులకు కదం తొక్కి పదరా...
ఆటపాటల హరివిల్లులై
ఆశల తోటలో చిరుజల్లులై
పదర పదర పదరా...
బడులకు కదం తొక్కి పదరా...
పుస్తకమే ప్రగతికి రూపం
పాఠశాలే జగతికి దీపం
పదర పదర పదరా...
బడులకు కదం తొక్కి పదరా...
నేటి బాలలే రేపటి భవిత
దేశ ప్రగతికి వెలుగుల జనత
పదర పదర పదరా...
బడులకు కదం తొక్కి పదరా..
డాక్టర్ కటుకోఝ్వల రమేశ్
కవి, రచయిత, ఖమ్మం జిల్లా


