వేసవి సెలవులు మధుర జ్ఞాపకాలు,
ఆటలతో నిండిన ఆనంద క్షణాలు.
బంధువులతో నవ్వులు పంచుకున్నాం,
ప్రతి రోజును హాయిగా గడిపేశాం.
ఇప్పుడు మళ్లీ పాఠశాల పిలుపు,
కొత్త పుస్తకాలతో జ్ఞాన వెలుగు.
కొత్త తరగతి, కొత్త ఆశయం,
విజయానికి ఇది కొత్త ప్రారంభం.
కొత్త జీవితం, కొత్త యుగం,
లక్ష్యాల వైపు వేస్తాం అడుగులు దృఢం.
క్రమశిక్షణతో ముందుకు సాగుదాం,
కొత్త కమిట్‌మెంట్‌తో కలలను చేరుదాం.
వేసవి జ్ఞాపకాలను హృదయంలో ఉంచుకొని,
కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ఆహ్వానిద్దాం!
– దూపాటి హరిప్రసాద్
షాపూర్ నగర్, హైదరాబాద్


