సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ మంకమ్మతోటలోని ధన్గర్‌వాడీ ఉన్నత పాఠశాలలో గత 42 రోజులుగా నిర్వహించిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు గురువారంతో విజయవంతంగా ముగిసింది. డ్రాయింగ్, టైలరింగ్ విభాగాల్లో మే 1న కోర్సు ప్రారంభం కాగా.. 8 జిల్లాల నుంచి డ్రాయింగ్‌లో 457 మంది, టైలరింగ్‌లో 300 మంది పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కోర్సు కోఆర్డినేటర్, శిక్షకులు సర్టిఫికెట్లు అందించారు. 42 రోజుల పాటు నైపుణ్య శిక్షణ పొందిన వీరు, ఇకపై ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకుంటూ తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు సన్నద్ధమయ్యారు.


