వాలీబాల్‌.. జీవనపాఠం | - | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌.. జీవనపాఠం

Jun 12 2026 5:57 AM | Updated on Jun 12 2026 5:57 AM

యువతలో మార్పు కోసం..

విజయాలివీ..

సన్మార్గంలో వెళ్తున్న యువత వాలీబాల్‌ శిక్షణతో అగ్నివీర్‌కు ఎంపిక

జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణింపు ఉచిత కోచింగ్‌ ఇస్తున్న కానిస్టేబుల్‌ శేఖర్‌

ముస్తాబాద్‌(సిరిసిల్ల): వాలీబాల్‌ అంటే వారికి ప్రాణం. రాత్రి, పగలు తేడాలేకుండా ఆడుతూనే ఉంటారు. కాలేజీకి వెళ్తూ ఉదయం, సాయంత్రం వాలీబాల్‌ ఆడడమే వారికి తెలుసు. యువత అందరూ సెల్‌ఫోన్‌, సోషల్‌మీడియాలో బీజీగా ఉంటే వీరు మాత్రం వాలీబాల్‌పై మనసు పారేసుకున్నారు. వీరు వాలీబాల్‌పై ఆసక్తి చూపడానికి స్థానిక ఠాణాలో నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ శేఖర్‌ కృషి ఉంది. మూడేళ్లుగా వాలీబాల్‌లో కోచింగ్‌ ఇస్తున్నారు. సొంత ఖర్చులతో క్రీడాకారులను వివిధ రాష్ట్రాలలో జరిగే వాలీబాల్‌ టోర్నమెంట్లకు శేఖర్‌ తీసుకెళ్తున్నారు.

నిత్య శిక్షణ.. కౌన్సెలింగ్‌

ముస్తాబాద్‌లో నాలుగేళ్ల క్రితం కొంతమంది యువత మత్తుకు బానిసలుగా మారి, గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఎంతో భవిష్యత్‌ ఉన్న యువత ఇలా మత్తు వైపు వెళ్లవద్దని కానిస్టేబుల్‌ శేఖర్‌ వాలీబాల్‌ శిక్షణను మొదలుపెట్టారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు జీవితపాఠాలు నేర్పుతూ భవిష్యత్‌ను ఎలా బంగారుమయం చేసుకోవాలో కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. హైస్కూల్‌, జూనియర్‌ కాలేజీ మైదానాల్లో నిత్యం వాలీబాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్జీఎఫ్‌ పోటీల్లో ముస్తాబాద్‌ జట్టు ప్రథమస్థానం సాధించింది. ఇలా మొదలైన వారి ప్రస్థానం రాష్ట్రస్థాయి, అంతర్‌రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు పంపే వరకు సాగిపోతోంది.

యువత పెడదారి పట్టకుండా పోలీస్‌శాఖ అనేక కార్యక్రమాల ను చేపట్టింది. నేను యూత్‌ పి ల్లలకు వాలీబాల్‌లో కోచింగ్‌ ఇ వ్వాలనుకుని, 20 మందిని సె లెక్ట్‌ చేసుకున్న. మూడేళ్లుగా వా రికి కోచింగ్‌ ఇస్తున్న. స్టేట్‌ లెవెల్‌కు సెలెక్ట్‌ అయ్యా రు. వారిలో కొంత మంది ఉద్యోగాలు సాధిస్తున్నా రు. క్రమశిక్షణతో శిక్షణ తీసుకుంటే యూత్‌ భవిష్యత్‌కు పునాది అవుతుందని కోచింగ్‌ ఇస్తున్నాను.

– చేరాల శేఖర్‌, కోచ్‌, ముస్తాబాద్‌

మేడారంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ వాలీబాల్‌ పోటీల్లో పుల్లూరి మనోజ్‌ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ శిబిరానికి ముస్తాబాద్‌కు చెందిన తరుణ్‌ ఎంపికయ్యాడు.

హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ పోటీల్లో కంతుల నిఖిల్‌ ప్రతిభ చాటాడు.

కంతుల అజయ్‌ నిత్యం వాలీబాల్‌ ప్రాక్టీస్‌ చేస్తూ అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు.

చెవుల స్వామి, ప్రవీణ్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ జట్టులో సభ్యులుగా ప్రతిభ కనబరుస్తున్నారు.

చిన్ననాటి నుంచి వాలీబాల్‌ ఆడుతూ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి స్పోర్ట్స్‌ కోటాలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించిన శేఖర్‌ స్ఫూర్తితో ముస్తాబాద్‌ యువత ముందుకెళ్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement