సన్నరకంపై స్పష్టత | - | Sakshi
Sakshi News home page

సన్నరకంపై స్పష్టత

Jun 12 2026 5:57 AM | Updated on Jun 12 2026 5:57 AM

జేజీఎల్‌–1798 కేఎన్‌ఎం–1638 ఆర్‌ఎన్‌ఆర్‌–15048 డబ్ల్యూజీఎల్‌–44 డబ్ల్యూజీఎల్‌–962

వరి వంగడాల పేర్లు ప్రకటన

కరీంనగర్‌అర్బన్‌: సన్నరకం వరి వంగడాలపై రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పష్టతనిచ్చింది. వానాకాలం సీజన్‌లో 8 రకాల సన్న రకం వరి వంగడాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో ఆరు (బీపీటీ–5204, జేజీఎల్‌–1798, కేఎన్‌ఎం–1638, ఆర్‌ఎన్‌ఆర్‌–15048, డబ్ల్యూజీఎల్‌–44, డబ్ల్యూజీఎల్‌–962) వంగడాలను విడుదల చేయగా మిగతా రెండు ప్రైవేటు రకాలున్నాయి. రైతులు వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి తమ ప్రాంతానికి, కాలానికి అనుగుణంగా ఉన్న వంగడాలను ఉయోగించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

వానాకాలం 125 రోజుల పంట కాలం కాగా యాసంగిలో 140 రోజుల పంట. హెక్టారుకు 62.5–75 క్వింటాళ్ల వరకు దిగుబడి రానుంది. మిక్కిలి సన్న గింజ రకం. సాంబమసూరిని పోలి ఉంటుంది. ఉల్లి కోడును సమర్థంగా, అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.

వానాకాలం 120–125 రోజుల పంట కాలం కాగా యాసంగిలో 130–135 రోజుల్లో పండుతుంది. హెక్టారుకు 76–85 క్వింటాళ్లు దిగుబడి రానుండగా ఉల్లికోడు, అగ్గితెగులును సమర్థంగా తట్టుకుంటుంది. అన్నం రుచితో పాటు నాణ్యత ఉంటుంది.

వానాకాలం 125 రోజుల పంట కాగా యాసంగి 135 రోజుల పంట. హెక్టారుకు 65–70 క్వింటాళ్లు దిగుబడి రానుండగా బీపీటీ–5204తో సమానం. అన్నం నాణ్యత రుచికరంగా ఉండనుండగా తక్కువ నత్రజనితో ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. అగ్గితెగులును తట్టుకుంటుంది. ఎక్కువగా మొగిపురుగు ఆశిస్తుంది. వానాకాలం, యాసంగిలో 70శాతం నూక లేకుండా నాణ్యమైన బియ్యం వస్తుంది. చక్కెర వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం. వానాకాలంలో జూలై చివరి వరకు నార్లు పోసుకోవాలి. జూన్‌లో నార్లు పోసుకుంటే కాలపరిమితి పెరుగుతుంది. యాసంగిలో కొంచెం ఎత్తుగా పెరుగుతుంది. నత్రజని మోతాదును 25 శాతం వరకు తగ్గించి వేయాలి.

వానాకాలం పంటకాలం 140–145 రోజులు కాగా హెక్టారుకు 70–75క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. సాంబమసూరికి ప్రత్యామ్నాయ రకం. ఉల్లికోడు, చౌడును కొంత వరకు తట్టుకుంటుంది. అగ్గితెగులు నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సేంద్రియ సాగుకు అనువైన రకం. గింజ రాలే గుణం తక్కువగా ఉంటుంది.

వానాకాలంలో 120–125 రోజుల పంట కాలం కాగా యాసంగిలో 130–135 రోజులు. హెక్టారుకు 65–75 క్వింటాళ్లు రానుండగా అగ్గితెగులును కొంత వరకు తట్టుకుంటుంది. అన్నం నాణ్యత సాంబమసూరిని పోలి ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement