విద్యా సంస్థలు
విద్యా సంవత్సరం వారీగా విద్యార్థుల సంఖ్య
ఇబ్బందులు లేకుండా చూస్తాం
సెలవులకు టాటా
జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల
కామారెడ్డి టౌన్ : వేసవి సెలవులు ముగియడంతో నేటి (సోమవారం) నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రభు త్వ బడులు పునఃప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో అడుగుపెడుతున్న విద్యార్థులకు స్వాగతం పలికేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ‘బడిబాట’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. అయితే పలు పాఠశాలల్లో మౌలిక వసుతులు లేక విద్యార్థులకు ఈ ఏడాది సైతం ఇబ్బందులు తప్పేలా లేవు. విద్యాశాఖ ముందస్తు ప్రణాళిక లేక విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాకు ఇంకా స్కూల్ యూనిఫామ్‌లు చేరుకోలేదు. ఇప్పటికే 5.32లక్షల పాఠ్యపుస్తుకాలు చేరాయి. ఈ సారి అన్ని తరగతులకు నోట్ బుక్స్ కూడా పంపిణీ చేయనున్నారు.
చెల్లించింది 50 శాతం బిల్లులే..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, గురకులాలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు మొత్తం 1,086 ఉన్నాయి. వీటిలో గతేడాది 99,362 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఈ విద్యా సంవత్సరానికి గాను బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రతిష్టాత్మకంగా ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. 973 స్కూళ్లను ఎంపిక చేసి తాగునీటి సౌకర్యం, విద్యుద్దీకరణ, మరుగుదొడ్లు, మూత్రశాలల మరమ్మతులు, తరగతి గదుల మేజర్, మైనర్ రిపేర్ల కోసం ప్రభుత్వం రూ. 22 కోట్ల నిధుల ప్రతిపాదనలతో పనులు చేపట్టారు. రెండేళ్ల క్రితం పనులు చేపట్టినప్పటికీ పనులు పూర్తి చేసిన 715 పాఠశాలలకు కేవలం 50 శాతం బిల్లులు మాత్రమే రెండు దఫాలుగా చెల్లించారు. మరో రూ. 9.96 కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉండిపోవడంతో పనులు చేసిన కమిటీలు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి, వంటగదులు, తరగతి గదులు, ఫర్నిచర్ కొరత తదితర సమస్యలతో 60 శాతం పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
గర్ల్స్ హైస్కూల్‌లో విరిగిపోయిన తాగునీటి నల్లాలు
ప్రైవేట్ 183
మండల పరిషత్ 994
కేజీబీవీ 19
రాష్ట్ర ప్రభుత్వ(డీఎన్‌టీ) 14
మోడల్ స్కూల్స్ 11
మిని గురుకుల 02
మైనారిటీ వెల్ఫేర్ 06
బీసీ వెల్ఫేర్ 08
ట్రైబల్ 04
సోషల్ వెల్ఫేర్ 11
2023–24 24–25 25–26
ప్రభుత్వ 81,864 76,184 76,082
ప్రైవేట్ 65,271 69,362 71,165
నేడు మోగనున్న బడి గంట
తెరుచుకోనున్న పాఠశాలలు
బడుల్లో సదుపాయాలు అంతంతే..
ఇంకా చేరుకోని ఏకరూప దుస్తులు
ఏటేటా తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల క్రితం 81,864 మంది విద్యార్థులుండగా, గత విద్యాసంవత్సరానికి ఆ సంఖ్య 76,082కు తగ్గిపోయింది. మూడేళ్లలో దాదాపు ఆరువేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి వెళ్లిపోయారు.
సోమవారం నుంచి పా ఠశాలలు ప్రారంభమవుతు న్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని హెచ్‌ఎంలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులకు పాఠ్య, నోట్ బుక్స్ పంపిణీ చేస్తాం. ఏకరూప దుస్తులు రాగానే పంపిణీ చేస్తాం. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలన్ని పరిష్కరిస్తాం.
– మల్లికార్జున్, డీఈవో, కామారెడ్డి
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనైనా సర్కారు బడుల రూపరేఖలు మారుతాయని ఆశించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చిన్నపాటి వర్షాలకే చాలా పాఠశాలల ఆవరణలు బురదమయమవుతున్నాయి. వేసవి సెలవుల్లో ప్రహరీలు లేని పాఠశాలల్లో ఆకతాయిలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పలు పాఠశాలల్లో నల్లాలు, విద్యుత్ వైరింగ్, మరుగుదొడ్ల తలుపులను ధ్వంసం చేశారు. ‘మన ఊరు – మన బడి’ కింద చేపట్టిన భవన, డైనింగ్ హాళ్ల నిర్మాణాలు సగానికి పైగా నిలిచిపోయి అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. ఇరుకై న వంటశాలలు, అరకొర తాగునీటి సమస్యలు ఇంకా చాలా చోట్ల వేధిస్తున్నాయి.


