ప్రధాన జలాశయాలు, చెరువులు, బోర్ల కింద ఆయకట్టు (ఎకరాల్లో..)
జిల్లాలో వానాకాలం పంటల సాగు అంచనా (ఎకరాల్లో..)
పదిరోజులాయే వానల్లేవు
● ముందస్తు వర్షాలు కురిసి
మళ్లీ కనిపించని వైనం
● నారుమడులు సిద్ధం చేసిన రైతుల్లో అయోమయం
నిజాంసాగర్(జుక్కల్): జిల్లాలోని పలు ప్రాంతాల రైతులను మృగశిర కార్తె వర్షం మురిపించింది. ముందస్తు వర్షాలతో రైతులు సాగు పనులకు సన్నద్ధమయ్యారు. చాలాచోట్ల నారుమడులను సిద్ధం చేసి విత్తనాలు అలికారు. అయితే వారం, పది రోజులుగా మళ్లీ వర్షం కురవకపోవడంతో నారుమడులు ఎండుతున్నాయి. చెరువులు, కుంటలు, వర్షంపై ఆధారపడి పంట సాగు చేసే రైతులు నారుమడులను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. జూన్, జూలై నెలల్లో వర్షాలు కురిసినా.. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పూర్తిస్థాయిలో వర్షాలు ప్రారంభమైన తరువాతే సాగు పనులు ప్రారంభించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు అలికిన చోట్ల వర్షం లేక మొలకలు రావడం లేదు. మొలకలు వచ్చిన చోట్ల ఎండిపోయే పరిస్థితి ఉంది. మరోనాలుగైదు రోజుల్లో వర్షాలు కురకపోవతే నారుమడులు ఎండిపోయే ప్రమాదం ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్టు 31,927
పోచారం 10,500
కౌలాస్ నాలా 9,000
జిల్లాలో చెరువులు ఆయకట్టు
2069 97,123
బోరుబావులు ఆయకట్టు
1,09,717 1,45,122
వరి 3.20 లక్షలు
మొక్కజొన్న 54,500 వేలు
పత్తి 45,500
సోయా 90,684
మినుము 2,858
పెసర 3,382
కంది 41,500
చెరుకు 588
ఇతర పంటలు 278
రోహిణి, మిర్గం రోజుల్లో వానపడటంతో నారు మడి వేసుకున్నా. వారం రోజుల సంది వర్షాలు లేవు. కుంటలో నుంచి నీటిని తెచ్చి నారుమడిని తడుపుతున్నా. వర్షాలు పడతాయని నమ్మకంతో సాగుకు సిద్ధమైన.
– దనుల ఎల్లయ్య, రైతు, వెల్లుట్ల


