బడి రూపురేఖలు మార్చిన టీచర్‌ | - | Sakshi
Sakshi News home page

బడి రూపురేఖలు మార్చిన టీచర్‌

Jun 15 2026 1:17 AM | Updated on Jun 15 2026 1:17 AM

బడి రూపురేఖలు మార్చిన టీచర్‌ విద్యార్థులకు ప్రేరణగా ఉండాలి..

ప్రైవేట్‌ పాఠశాలల కన్నా నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో తరగతి గదుల్లో పెయింటింగ్‌, డ్రాయింగ్‌ వేయించాను. దాదాపు రూ.10 వేల వరకు వెచ్చించాను. తరగతి గదులు విద్యార్థులకు ప్రేరణగా ఉండాలనేది నా ఆలోచన. హెచ్‌ఎం ప్రోత్సాహంతో అసంపూర్తిగా ఉన్న గది నిర్మాణాన్ని పూర్తి చేశాం. – శిరీష, టీచర్‌

దోమకొండ: వచ్చామా.. పాఠం చెప్పామా... వెళ్లిపోయామా.. అన్నట్టు కాకుండా పిల్లలతో మమేకమవుతూ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శిరీష. తాను పని చేస్తున్న పాఠశాలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిద్దేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మండలంలోని అంబారిపేట ప్రభుత్వ హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న శిరీష గతేడాది సంఘమేశ్వర్‌ గ్రామం నుంచి బదిలీపై వచ్చారు. అంబారిపేట పాఠశాలలో ఒకటే గది ఉండటం, దానిలోనే ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు బోధించడం ఇబ్బందిగా ఉండటంతో పాఠశాల పై అంతస్తులో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాన్ని పూర్తి చేయించాలని నిర్ణయించారు. దీని కొసం విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చింగా, తాము పేదవాళ్లమని.. అయినప్పటికీ ఎంతోకొంత ఆర్థికసాయం చేస్తామని భరోసా ఇచ్చారు. వెంటనే శిరీష హెచ్‌ఎం అంజన్‌ప్రసాద్‌తో మాట్లాడి తన సొంత నిధులు కొంత వెచ్చించి ముందుగా మేసీ్త్రలను పిలిపించి పనులు మొదలుపెట్టారు. అదనపు గది నిర్మాణం పూర్తి చేసేందుకు సుమారు రూ.2లక్షల 55 వేలకు పైగా వెచ్చించారు. దాంట్లో గ్రామస్తులు రూ.81 వేలు సమకూర్చగా, హెచ్‌ఎం రూ.11 వేలు అందించారు. మిగతా రూ.లక్షా 74 వేలు తన సొంత డబ్బులను శిరీష ఖర్రచు చేశారు. గది నిర్మాణంతో పాటు కిటికీలు, మెట్లకు సైడ్‌వాల్స్‌ బిగించి గదికి రంగులు, బొమ్మలను వేయించారు. హరిజనవాడలోని పిల్లలందరూ ఇదే పాఠశాలలో అభ్యసిస్తున్నారు. ఆటపాటలతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు శిరీష.

ఉపాధ్యాయ వృత్తిలో

ఆదర్శంగా నిలుస్తున్న శిరీష

అదనపు గది నిర్మాణానికి సొంతంగా

సుమారు రూ.2లక్షల వరకు ఖర్చు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement