రక్తదానం మహాదానమని, ఒకరికి పునర్జన్మను ప్రసాదించే రక్తదానంపై అవగాహన కల్పించేలా ఆర్ట్ టీచర్ బాల్‌కిషన్ రావి ఆకుపై రక్తపు చుక్కను తీర్చిదిద్దాడు. మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న బాల్‌కిషన్ ఆదివారం వరల్డ్ బ్లెడ్ డోనర్ డే సందర్భంగా రావి ఆకుపై ప్రత్యేకంగా వరల్డ్ బ్లడ్ డోనర్ డే అని రాసి రక్తపు చుక్క ఆకారం వేశాడు. దేశంలో చాలా మంది రక్తం దొరక్క మృతి చెందుతున్నారని, రక్తదానం..ప్రాణ దానమని ఆయన పేర్కొన్నారు.
– మద్నూర్ (జుక్కల్)


