నాసా స్పేస్‌ క్రాఫ్ట్‌కు భారత వ్యోమగామి పేరు!

US Spacecraft Named After late Indian-American Astronaut Kalpana Chawla - Sakshi

వాషింగ్టన్‌: దివంగత నాసా వ్యోమగామి కల్పనా చావ్లాకు నివాళి అర్పించేందుకు అమెరికన్‌ వాణిజ్య కార్గో అంతరిక్ష నౌకకు ఆమె పేరును పెట్టింది. మానవ అంతరిక్ష ప్రయాణానికి ఆమె చేసిన కృషికి గాను ఈ విధంగా నివాళులు అర్పించారు. భారతదేశం నుంచి అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి మహిళ కల్పనా చావ్లా. అమెరికన్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ నార్త్రోప్ గ్రుమ్మన్ దాని తదుపరి సిగ్నస్‌ క్యాప్సూల్‌కు ‘ఎస్‌ఎస్‌  కల్పనా చావ్లా’ అని పేరు పెట్టనున్నట్లు ప్రకటన చేసింది.

2003లో ఆరుగురు సభ్యులతో ప్రయాణిస్తున్న కొలంబియా అనేక నౌక కుప్పకూలడంతో కల్పనా చావ్లా మరణించింది. "నాసాలో పనిచేస్తూ భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లాను ఈ రోజు మనం గౌరవిస్తున్నాం. మానవ అంతరిక్ష ప్రయాణానికి ఆమె చేసిన కృషి శాశ్వత ప్రభావాన్ని చూపింది" అని కంపెనీ బుధవారం ట్వీట్‌లో తెలిపింది. కొలంబియాలో ఆన్‌బోర్డ్‌లో ఆమె చేసిన చివరి పరిశోధన అంతరిక్ష ప్రయాణ సమయంలో వ్యోమగామి ఆరోగ్యం, భద్రతను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడింది. కల్పన చావ్లా జీవితాన్ని, అంతరిక్షంలో ప్రయాణించాలనే ఆమె కలని నార్త్రోప్ గ్రుమ్మన్ ఈ సందర్భంగా జరుపుకోవడం మాకు గర్వంగా వుంది’ అని ఈ సంస్థ తెలిపింది.

చదవండి: నాసా, స్పేస్‌ ఎక్స్ మరో అద్భుత విజయం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top