New Omicron Variant-WHO: 57 దేశాల్లో వెలుగులోకి ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఏ.2, స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ

Omicron Sub Variant Could Be More Infectious Found In 57 Countries - Sakshi

లండన్‌: ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతునే ఉంది. మరొవైపు ఒమిక్రాన్‌ కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు కొత్త కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం బీఏ.2 వేరియంట్‌ పలు దేశాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజా అధ్యయనాల ప్రకారం.. బీఏ.2 వేరియంట్‌ ఇప్పటికే.. 57 దేశాలలో వెలుగులోకి వచ్చింది. ఇది ఒమిక్రాన్‌ వేరియంట్‌ కన్నా.. రెట్టింపు వేగంతో వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కాగా, ఈ వేరియంట్‌ పదివారాల క్రితం దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. చాలా తక్కువ సమయంలో పలుదేశాల్లో విస్తరించిందని పరిశోధకులు తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సేకరించిన తాజా నమునాలలో.. అనేక  కొత్త వేరియంట్‌లు కనుగొనబడ్డాయని తెలిపారు. వీటిలో ప్రధానంగా.. బీఏ.1,  బీఏ.1.1,  బీఏ.2 మరియు బీఏ.3. రకానికి చెందిన వేరియంట్‌లు గుర్తించబడినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. వీటిలో బీఏ.2 సబ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని బీఏ.2 ఏమార్చగలదని తెలిపారు.

కొత్త వేరియంట్‌ ఇమ్యూనిటీ నుంచి ఈ సబ్‌ వేరియంట్‌ సులభంగా తప్పించుకొనే సామర్థ్యం కల్గి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం బీఏ.1, బీఏ.1.1 వేరియంట్‌లను గుర్తించామని, గ్లోబల్‌ సైన్స్‌ ఇనిషియేటివ్‌కి 96 శాతం.. ఓమిక్రాన్‌ వేరియంట్‌ను పోలి ఉందని పరిశోధకులు వెల్లడించారు. బీఏ.2 వేరియంట్‌ మానవ కణాలలోకి ప్రవేశించడానికి అనేక ఉత్పరివర్తనాలు కల్గి ఉండి, స్పష్టమైన పెరుగుదల ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

డబ్ల్యూహెచ్‌వో పరిశోధకుల్లో ఒకరైన వాన్‌ కెర్ఖోవ్‌  బీఏ.2 వేరియంట్‌పై స్పందిచారు. దీనిపై సమాచారం పరిమితంగా ఉందని తెలిపారు. బీఏ.1 కంటె కూడా.. బీఏ.2 అధిక వ్యాప్తిని కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుతం డెల్లా వేరియంట్‌.. మునుపటి కరోనా కంటె.. తక్కువ తీవ్రత కల్గి ఉందని అన్నారు. ప్రస్తుతం కరోన ఒక ప్రమాదకరమైన వ్యాధిగా మిగిలిపోయిందని వాన్‌ కెర్ఖోవ్‌ చెప్పుకొచ్చారు.

చదవండిః సొంత వాహనాల్లోనూ మాస్క్‌ తప్పనిసరి! ఇంకెన్నాళ్లు?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top