పిల్లల్ని కంటే రుణాలిస్తాం | Sakshi
Sakshi News home page

పిల్లల్ని కంటే రుణాలిస్తాం

Published Sat, Dec 25 2021 5:03 AM

Chinese province offers loans for babies as population slides - Sakshi

బీజింగ్‌: ఒకప్పుడు చైనా అంటే జనాభా విస్ఫోటనం. దీన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం పలు కఠిన నియమాలు తెచ్చింది. అవన్నీ ఫలితాలివ్వడంతో చాలావరకు జనన రేటు అదుపులోకి వచ్చింది. ఈ ప్రయత్నాలు క్రమంగా ఆదేశ జనాభా తరుగుదలకు, ముఖ్యంగా యువత సంఖ్య తగ్గేందుకు కారణమయ్యాయి. ప్రమాదాన్ని ఊహించిన ప్రభుత్వం ప్రస్తుతం మరింతమందిని కనేందుకు ప్రోత్సాహాలిస్తోంది.

ఈ కోవలోనే జిలిన్‌ ప్రావిన్సు కొత్త పథకం ప్రకటించింది. పెళ్లైన వారు పిల్లలు కనాలనుకుంటే వారికి 2 లక్షల యువాన్ల(సుమారు రూ. 25 లక్షలు) బ్యాంకు రుణాలిప్పిస్తామని ప్రకటించింది. చిన్నాచితకా వ్యాపారాలు నడిపే జంటలకు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది పిల్లలుంటే వారి వ్యాపారాలపై పన్నుల్లో తగ్గింపులు, మినహాయింపులు ఇస్తామని ప్రకటించింది.

Advertisement
Advertisement