China Targets Online Platforms: చైనా సైబర్‌స్పేస్‌ చివరి యుద్ధం!...ఇంటర్నెట్‌ క్లీన్ అప్!!

China Targets Online Platforms In Quest To Clean Up - Sakshi

Cyberspace Administration of China: ఇంటర్నెట్‌ను "క్లీన్ అప్" చేయడానికి చైనా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఇంటర్నెట్‌ను "క్లీన్ అప్" చేసే డ్రైవ్‌లో భాగంగా నకిలీ ఖాతాల సమాచారాన్ని అరికట్టడానికి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు, వీడియో-షేరింగ్ సైట్‌ల వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను చైనా పరిశీలిస్తుందని ఆ దేశ సైబర్ రెగ్యులేటర్ తెలిపింది. చైనాలోని సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఏసీ) మోసపూరిత ఆన్‌లైన్‌లను లక్ష్యంగా చేసుకోని రెండు నెలల ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

(చదవండి: అవిభక్త కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు!!)

నకిలీ అకౌంట్లు, సాంకేతికత, రియల్ ఎస్టేట్, గేమింగ్, విద్య, క్రిప్టోకరెన్సీలు వంటి వాటికి సంబంధించిన ఫైనాన్స్‌లో కంపెనీల పర్యవేక్షణను అధికారులు కఠినతరం చేయనున్నారు. ఈ మేరకు సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ, మున్సిపల్‌ బాడీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. అంతేకాదు ఈ సమావేశంలో సీఏసీ ఆన్‌లైన్ ట్రాఫిక్, హానికరమైన పబ్లిక్ రిలేషన్స్, కామెంట్‌లు, నగదు కోసం రూపొందించే వెబ్‌లు వంటివి... నెటిజన్ల చట్టబద్ధమైన హక్కుల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పేర్కొంది. పైగా చైనా సీఏసీ "చివరి యుద్ధం" గా అభివర్ణించిది. అంతేకాదు ఇంటర్నెట్‌ను "క్లీన్ అప్" డ్రైవ్ చేయండి అని పిలుపినిచ్చింది.

(చదవండి: ఒక్క అంకె తప్పుగా ఇవ్వడంతో ఆ మహిళకు ఏకంగా 4,500 మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయి!!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top