వీసీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు
వరంగల్ అర్బన్ : స్ట్రీట్ ఫుడ్ హబ్‌లతో వెండర్ల జీవనోపాధి మెరుగవుతుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ ఈషా కిరణ్ అన్నారు. మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులు, స్ట్రీట్ వెండర్లు, స్వయం సహాయక బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ఈషా కిరణ్ మాట్లాడుతూ కేంద్ర పట్టణ జీవనోపాధి మిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అందులో గ్రేటర్ వరంగల్ ఒకటని, స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.4కోట్ల నిధులను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మార్గదర్శకత్వంలో రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను అధికారులు వివరించారు. స్ట్రీట్ ఫుడ్ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదించిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు కేంద్ర అధికారులు వచ్చే వారం వరంగల్‌లో పర్యటించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. వీసీలో అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ రవికుమార్, మెప్మా పీడీ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.


