గుంటూరు ఎడ్యుకేషన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ను రద్దు చేయించే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం టెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యాహక్కు చట్టంలో మార్పులు చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్ మాట్లాడుతూ 50 ఏళ్లుపైబడి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, పాఠశాలలో అననుకూల పరిస్థితుల మధ్య ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులకు ఏ ఇతర ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా ఇన్ సర్వీస్ పరీక్ష పెట్టడం తగదన్నారు. ఉపాధ్యాయులు టెట్‌లో అర్హత సాధించడంపై ధ్యాసపెడితే బోధనకు విఘాతం కలుగుతుందన్నారు. రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి మాట్లాడుతూ టెట్ రద్దు కోసం యూటీఎఫ్ చేపట్టే కార్యాచరణలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన టెట్‌లో ఉన్న అసంబద్ధ నిర్ణయాలు ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ఇబ్బందికరమన్నారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ గయాసుద్దౌలా, జిల్లా కార్యదర్శి ఆదినారాయణ, సాంబశివరావు, ఆంజనేయులు, అడవి శ్రీను, కె. కేదార్నాథ్, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, కె.కామాక్షి పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
నక్కా వెంకటేశ్వర్లు


