తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ ● 9వ తేదీన హాఫ్‌పేటలో పట్టపగలు తాళం వేసి ఉన్న ఇంట్లో రూ. 25 ఖమ్మం జిల్లాకు చెందిన బి.గోపి అపహరించుకెళ్లాడు. ● తెనాలి గంగానమ్మపేట మార్వాడీ గుడి ఎదురు రోడ్లుని శ్రీ సాయి బాలాజీ జ్యుయలర్స్‌లో మార్చి 12వ తేదీ అర్ధరాత్రి దాటాక భారీ చోరీ జరిగింది. దాదాపు తొమ్మిది కిలోల వెండి ముడి సరుకు, ఒక కిలో వెండి వస్తువులు, 10 గ్రాముల బంగారం అపహరణకు గురయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.

తెనాలిరూరల్‌: పట్టణ సుల్తానాబాద్‌లోని గాయత్రి వే బ్రిడ్జి సమీపంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. కూలి పనులకు వెళ్లే మరియమ్మ ఒంటరిగా నివసిస్తోంది. గురువారం ఆమె బంధువుల ఇంటికి వెళ్లి.. శనివారం సాయంత్రం తిరిగి వచ్చింది. ఆదివారం ఉదయం చూసుకోగా ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు రూ. 4 లక్షల నగదు, 25 గ్రాముల బంగారు ఆభరణాలు, 100 గ్రాముల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా త్రీ టౌన్‌ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది.

బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు..

తెనాలి ప్రాంతంలో ఇటీవల చోరీలు పెరుగుతున్నాయి. మండలంలోని కఠెవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఈ నెల 4వ తేదీన ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. తిరిగి 7వ తేదీ అర్ధరాత్రి వచ్చారు. చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. రూ. లక్ష నగదు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement