వైఎస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

మాజీ సీఎంపై మాణిక్యరావు ఆరోపణలు అర్థరహితం వైఎస్సార్‌ సీపీ, టీడీపీ పాలనలో సంక్షేమంపై చర్చకు సిద్ధమా? లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌గా చర్మకార వృత్తిదారులకు చేసిన మేలు శూన్యం వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గెడ్డేటి సురేంద్ర ధ్వజం

దళితుల్లో ఏ ఒక్కరికై నా పెన్షన్‌ ఇప్పించారా?

గుంటూరు ఎడ్యుకేషన్‌: కార్పొరేటర్‌గా సైతం గెలవని పిల్లి మాణిక్యరావుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత లేవని వైఎస్సార్‌ సీపీ జిల్లా ఎస్సీ విభాగ అధ్యక్షుడు గెడ్డేటి సురేంద్ర అన్నారు. ఆదివారం బృందావన్‌ గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సురేంద్ర మాట్లాడుతూ... గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కట్టబెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం చేసిన చంద్రబాబుకు ఆ సామాజిక వర్గానికి రాజ్యాంగ పదవుల్లో సముచిత స్థానం కల్పించిన వైఎస్‌ జగన్‌తో పోలికా అని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం గుర్తుకు రాదని, ఆయన్ను ఎవ్వరూ నమ్మరని ఆరోపించారు. యూటర్న్‌కు, వెన్నుపోటుకు, క్రెడిట్‌ చోరీకి ఆయన చిరునామా అన్నారు. మహానేత వైఎస్సార్‌ వేసిన పునాదులతో పైకి వచ్చిన వైఎస్‌ జగన్‌ రెండుసార్లు ఎంపీగా గెలవడంతోపాటు 151 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించి, ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలన అందించారని అన్నారు. స్పోర్ట్స్‌ కోటాలో పోస్టులు అమ్ముకుని, రూ.కోట్ల అవినీతికి పాల్పడిన డీఎస్సీ వ్యవహారంపై పిల్లి మాణిక్యరావుకు దమ్ముంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడించాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్లలో హామీలు అమలు చేయని ఫలితంగా రాష్ట్ర ప్రజలు రూ.లక్షన్నర కోట్లు నష్టపోయారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ అని తప్పుడు విమర్శలు చేస్తున్న పిల్లి మాణిక్యరావు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సైతం అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వైఎస్సార్‌ సీపీ తరఫున తాము చేసిన ఆరోపణలపై సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీలో ఎమ్మెల్యేలు, మంత్రులు లేక పిల్లి మాణిక్యరావుతో పదే పదే అబద్ధాలు, ఆరోపణలు చేయిస్తున్నారా అని మండిపడ్డారు. జిల్లాలో ఎస్సీ విభాగంలో టాపర్లుగా వచ్చిన అభ్యర్థులకు డీఎస్సీలో పోస్టులు ఇవ్వకుండా, డబ్బులు తీసుకుని అనర్హులకు పోస్టింగ్స్‌ ఇచ్చారని ఆరోపించారు. ఎస్సీ విభాగ నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ మాణిక్యరావు పదే పదే వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తున్నారని, కార్పొరేటర్‌గా గెలుపొందని మాణిక్యరావుకు ఆ అర్హత లేదన్నారు. ప్రజా ప్రతినిధిగా గెలుపొందని మాణిక్యరావు లిడ్‌క్యాప్‌ చైర్మన్‌గా ఎస్సీల సంక్షేమం కోసం పని చేయడం మాని, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నిత్యం వైఎస్‌ జగన్‌ను విమర్శిస్తున్నారని అన్నారు.

తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు అంకాలరాజు మాట్లాడుతూ డీఎస్సీపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేని మాణిక్యరావు తమపై ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీడీపీ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలోని 66 లక్షల పెన్షన్లలో ఆరు లక్షల పెన్షన్లు ఎత్తేశారని, పిల్లి మాణిక్యరావు దళితుల్లో ఏ ఒక్కరికై నా పెన్షన్‌ ఇప్పించారా అని ప్రశ్నించారు. డీఎస్సీపై లోకేష్‌తో ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జి.ప్రభు మాట్లాడుతూ మాణిక్యరావు అదే పనిగా తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ను, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మూతబడిన 400 చర్మకారుల కుటీరాలను తెరిపించడంలో లిడ్‌క్యాప్‌ చైర్మన్‌గా ఉన్న పిల్లి మాణిక్యరావు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో నాయకులు మనోజ్‌, వెంకట్రావు బత్తుల, కూచిపూడి కిరణ్‌, బాబు, సందీప్‌, దుర్గారావు, పాలపర్తి గోవర్ధన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement