ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
తెనాలి: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణానికి చెందిన రజక వలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో తొమ్మిదో వార్షికోత్సవాన్ని ఆదివారం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు పోతార్లంక ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన సంఘీయులైన వందమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రొఫెసర్ నిరంజన్, పులిగడ్డ నారాయణరావు, కొండేటి సురేష్, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, విశ్రాంత మున్సిపల్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి, ఏపీ ట్రాన్స్‌కో డీఈఈ పాగోలు భవాని తదితరులు మా ట్లాడారు. విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.2 వేల ఉపకార వేతనం, నోట్ పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ మెటీరియల్ తదితరాలు పంపిణీ చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్, శివనాగేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాస్, నాంచారయ్య, పెసర్లంక రమణ తదితరులు పాల్గొన్నారు.
‘పంచాయతీరాజ్ మినిస్టీరియల్’ అసోసియేషన్ సమావేశం
గుంటూరు రూరల్: నగరంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర కమిటీకి నిర్వహించాల్సిన ఎన్నికలను జూలై 31లోగా పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గత కొంతకాలంగా రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగకపోవడం వల్ల అసోసియేషన్ కార్యక్రమాలు సరైన రీతిలో జరగలేదని దానివల్ల పంచాయతీరాజ్‌శాఖలో జరిగిన పరిపాలన సంస్కరణలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్‌కు సరైన న్యాయం జరగలేదని పలువురు జిల్లా అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవోల పదోన్నతులలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్‌కు అన్యాయం జరిగిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. దశాబ్దాలు గా పదోన్నతులు లేక అన్యాయానికి గురైన రికార్డు ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 30 సంవత్సరాల పైన ఒకే క్యాడర్లో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లకు ఒక్క ప్రమోషన్ కూడా లభించకపోవడం చాలా బాధాకరమన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న జిల్లా పరిషత్ నాన్ టెక్నికల్ సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా సరెండర్ చేస్తున్నారని, ఈ ప్రక్రియను వెంటనే ని లుపుదల చేయకపోతే ప్రత్యక్ష కార్యచరణకు వెళ్లా లని కార్యవర్గంలో తీర్మానించారు. సంఘం రాష్ట్ర ట్రెజరర్ పి.దస్తగిరిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.మోహన్‌రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రా ఘవులు, సంఘం వివిధ జిల్లాల అధ్యక్షులు ముర ళి, సత్తిబాబు, శ్రీధర్‌రాజు, ప్రసాద్, నిర్మలభారతి, పెంచలయ్య, మురళీధర్‌రెడ్డి, శశిధర్, గుంటూరు జిల్లా కార్యదర్శి శామ్యూల్ పాల్,ఉద్యోగులు పాల్గొన్నారు.
పైపుల వ్యాపారి బలవన్మరణం
గుంటూరు రూరల్: ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలతో పైపుల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. ఏటుకూరుకు చెందిన ఎ.రాంబాబు(60) గ్రామంలోని బొంతపాడు రోడ్డులో పైపుల వ్యాపారం చేస్తూ జీవిస్తుంటాడు. ఇటీవల వ్యాపార లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో తన ఆఫీసులో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు.


