పెదకాకాని: విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేయడంపై కేసు నమోదు చేసినట్లు పెదకాకాని పోలీసులు శనివారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఒక విద్యార్థిని గుంటూరు నగర శివారులోని ప్రైవేట్ కళాశాలలో డెంటల్ కోర్స్ చదువుతుంది. ఆ విద్యార్థిని విశాఖపట్నంలో ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆ యువకుడు ప్రేమిస్తున్నానని, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. తన నెంబర్ బ్లాక్ చేయగా తన స్నేహితుల ద్వారా ఫోన్ చేసి యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. బాధితురాలు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టిపి నారాయణస్వామి తెలిపారు.
పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ
తాడికొండ: అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ వ్యయాలపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.


