ఆరెంజ్‌, క్యారెట్‌, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు..

World Sight Day These Common Nutritional Foods May Boost Your Eye Health And Eye Sight - Sakshi

ఆరోగ్యమైన జీవనానికి పోషకాహారం అవసరమనే విషయం మనందరికీ తెలిసిందే! పోషకాహారం అనే ఆలోచన మదిలోమెదలగానే బరువు తగ్గడం, మధుమేహం, గుండె ఆరోగ్యం.. వంటి ఇతర  సమస్యలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. ఐతే కంటి ఆరోగ్యం కూడా ముఖ్యమైనదే. ఆరోగ్యకరమైన చూపు పొందుకోవాలంటే.. లూటిన్‌, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, బేటాకెరొటిన్‌, ‌‘ఎ, సి, ఈ’ విటమిన్లు, జింక్‌.. వంటి పోషకాలు అవసరమౌతాయని ఢిల్లీ నూట్రీషనిస్ట్‌ లోకేంద్ర తోమర్‌ సూచిస్తున్నారు. ఏయే ఆహారాల్లో ఆయా పోషకాలు పుష్కలంగా ఉంటాయో తెలుసుకుందాం..

ఆరెంజ్‌ పండ్లు
విటమిన్‌ ‘సి’ పుష్కలంగా ఉండే ఆహారాలు నయనారోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆరెంజ్‌లో విటమిన్‌ ‘సి’ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకతకు మాత్రమే కాకుండా కంటిలో శుక్లాలు పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా నల్లగుడ్డుపై కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇది కళ్లు పొడిబారకుండా ఉండటానికి, గాయాలను మాన్పడానికి, ఎముకల పుష్టికి ఎంతో ఉపయోగపడుతుందని న్యూట్రిషనిస్ట్ రూపాలీ దత్తా తెలిపారు. 

చదవండి: బాప్‌రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు!

క్యారెట్‌
మన ఇంట్లో పెద్దవాళ్లు క్యారెట్‌ తింటే కంటి ఆరోగ్యానికి మంచిదని పదేపదే చెప్తుంటారు. ఎందుకంటే.. క్యారెట్లలో అధికంగా ఉండే బీటా కెరొటిన్‌ విటమిన్‌ ‘ఎ’గా రూపాంతరం చెందుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారని ఆయుర్వేద నిపుణులు రామ్‌ ఎన్‌ కుమార్‌ కూడా సూచిస్తున్నారు.

ఆప్రికాట్‌ పండ్లు
సాధారణంగా వేసవికాలంలో లభించే ఈ పండ్లు మన సంప్రదాయ వంటకాల్లో ఎప్పటినుంచో విరివిగా ఉపయోగంలో ఉన్నాయి. వీటిని డ్రైఫ్రూట్స్‌గా కూడా వినియోగిస్తాం. డీకే పబ్లిషింగ్‌వారి ‘హీలింగ్‌ ఫుడ్స్‌’ పుస్తకం ప్రకారం వృద్ధాప్యం వల్ల కలిగే దృష్టిలోపాలను నివారించడంలో ఈ పండ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ పండ్లలో బీటాకెరోటిన్‌ కంటెంట్‌ కూడా అధికమే.

చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..!

రాగులు
రాగుల్లో కంటి ఆరోగ్యానికి మేలు చేసే పోలీఫెనాల్స్‌ అధికంగా ఉంటాయని నూట్రీషనిస్ట్‌ శిల్సా ఆరోరా తెలిపారు. యాంటీ క్యాటెర్యాక్ట్‌ స్థాయిలు ఎక్కువ ఉండే పోలీఫెనాల్స్‌ కంట్లో శుక్లాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలాగే రక్తంలో షుగర్‌ స్థాయిలను నియంత్రించి డయాబెటిక్‌ ముప్పు నుంచి కాపాడటంలోనూ వీటి పాత్ర కీలకమైనదే. 

ఉసిరి
మనకు అందుబాటులో ఉండో ఆహారాల్లో ఉసిరి ఒకటి. ఉసిరి రోగనిరోధకతను పెంచడమేకాకుండా దృష్టిలోపాలను నివారించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుందని ఆయుర్వేద నిపుణులు రామ్‌ ఎన్‌ కుమార్‌  సూచిస్తున్నారు. ఉసిరిలోని కెరోటిన్‌ కళ్లను ఆరోగ్యంగా ఉంచి మెరుగైన చూపుకు తోడ్పడుతుందని అనేక అధ్యయనాలు కూడా వెల్లడించాయి.

శరీరంలోని వివిధ అవయవాల మాదిరిగానే కళ్ల ఆరోగ్యం కూడా ప్రధానమైనదే. కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి యేటా అక్టోబర్‌లో వచ్చే రెండో గురువారాన్ని ప్రపంచ దృష్టి దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ యేడాది అక్టోబర్‌ 14న జరుపుకునే ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా నిపుణులు సూచించిన ఈ ఆహార అలవాట్ల ద్వారా నయనారోగ్యాన్ని పదిలంగా కపాడుకుందాం..

చదవండి: Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top