గ్లోవ్‌ ధరిస్తే వాపులు మాయం!

Us Researchers Develop Smart Bandage To Cure Wounds - Sakshi

చేతులకు గాయాలై, ఆ గాయాల వల్ల వాపులు కూడా ఏర్పడితే రోజువారీ పనులు చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. గాయాల వల్ల ఏర్పడే వాపులు తగ్గించుకోవడానికి పెయిన్‌ కిల్లర్స్, పెయిన్‌ బామ్స్‌ వాడుతుంటాం. చేతి వాపులు తగ్గించుకోవాలంటే, ఇప్పుడు వాటితో పనిలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న గ్లోవ్‌ను తొడుక్కుంటే చాలు. నొప్పుల నుంచి సత్వర ఉపశమనం లభించడమే కాకుండా, వాపులు కూడా ఇట్టే తగ్గిపోతాయి.

అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సిండీ కావో నేతృత్వంలోని పరిశోధకులు ఈ అద్భుతమైన నొప్పినివారక గ్లోవ్‌ను ‘నిట్‌ డెమా’ పేరుతో ఇటీవల రూపొందించారు. ఒక వేలును మాత్రమే కప్పి ఉంచేలా దీన్ని రూపొందించారు. దీని తయారీకి మామూలు ఊలుతో పాటు, మిశ్రమ లోహాలతో తయారు చేసిన స్ప్రింగులను ఉపయోగించారు. దీన్ని పవర్‌బ్యాంక్‌కు కనెక్ట్‌ చేసుకుంటే, ఇందులోని మిశ్రమ లోహాల స్ప్రింగులు విద్యుత్తును గ్రహించి, కొద్దిగా వేడెక్కి మర్దన చేయడం మొదలు పెడతాయి. ఫలితంగా నొప్పి, వాపులు తగ్గుతాయి. దీని పనితీరుపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని వారు చెబుతున్నారు.

చదవండి: ఫుడ్‌ పాయిజన్‌ అయిందా? శొంఠి పొడి, తేనె కలిపి తాగుతున్నారా? అయితే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top