Home Creations: ఇంట్లో గ్రీన్‌వాల్‌ ట్రెండ్‌.. ఇప్పుడిదే ఎవర్‌గ్రీన్‌!!

Home Creations Green Wall With Plants Interior Designs - Sakshi

ఇప్పటి వరకు నేలపైన ఉన్న తోటలనే చూశారు. ఇప్పుడు నిలువుగా ఉండే తోటలను కూడా చూడవచ్చు. బయటే కాదు ఇంటి లోపల కూడా ఒక ఆకుపచ్చని గోడను సృష్టించవచ్చు. ఇది సులభం కూడా. ఒక నిజమైన ఇండోర్‌ నిలువు తోట కావాలనుకుంటే మాత్రం కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుసుకోవాలి. 

ఇండిపెండెంట్‌ హౌస్‌ అయినా, అపార్ట్‌మెంట్లలో అయినా ఇంట్లో పచ్చదనం ఉంటే ఆ కళే వేరు. కొన్ని పూల కుండీలతోనైనా ఆకుపచ్చనిదనాన్ని ఆస్వాదించాలనుకుంటారు. ఇక ఇంట్లో ఒక గోడ మొత్తం పచ్చదనం నింపుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఈ గ్రీన్‌వాల్స్‌ ఏర్పాటు చూస్తే అర్థమైపోతుంది. హోమ్‌ క్రియేషన్స్‌లో గ్రీన్‌వాల్‌ ట్రెండ్‌ ఎప్పుడూ ఎవర్‌గ్రీన్‌.

లతలతో అమరిక..
వేలాడే పచ్చదనం కోసం అందమైన క్రీపర్స్‌ను గోడల మీదకు పాకించవచ్చు. లేదంటే ఇండోర్‌ ప్లాంట్స్‌తో గోడకు గ్రీనరీ ఏర్పాటు చేసుకోవచ్చు. 

ఔషధ మొక్కలతో గ్రీన్‌ వాల్‌
గ్రీన్‌ వాల్‌ని ఎవ్వరైనా ఇష్టపడతారు. అందుకే ఇది ఇంటీరియర్‌ ట్రెండ్‌లో ఎప్పుడూ రిపీట్‌ అవుతూనే ఉంటుంది. అందులోనూ ఈ మహమ్మారి కాలంలో రకరకాల ఔషధ మొక్కల పెంపకం ఇంట్లోæగాలిని ప్యూరిఫై చేస్తుంది. కొన్ని మొక్కలు మాత్రమే గ్రీన్‌వాల్‌కి బాగా సూట్‌ అవుతాయి. వాటిలో కొన్ని రకాల ఔషధ మొక్కలు, ఆర్కిడ్స్, మనీప్లాంట్‌ లాంటి తీగ జాతి మొక్కలను ఎంచుకోవాలి. వీటి ఎంపికలో నిపుణుల సాయం తీసుకోవచ్చు.

కృత్రిమమైన పచ్చని తీగలతో ..
మొక్కలతో ఏర్పాటు, మెయింటెనెన్స్‌ కొంచెం కష్టం అనుకున్నవారు ఆర్టిఫిషియల్‌ హ్యాంగింగ్‌ తీగలు, లతలతో లివింగ్‌ రూమ్‌ లేదా బాల్కనీలో ఒక గోడకు పచ్చదనాన్ని నింపవచ్చు. హాయిగొలిపే ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. 

గ్రీన్‌ ఫ్రేమ్‌
పూర్తి గోడను ప్లాంటేషన్‌తో నింపితే బాగుండదు అనుకుంటే ఫ్రేమ్‌ పరిమాణంలోనూ ఆకుపచ్చని మొక్కలతో గదికి కొత్త అందాన్ని తీసుకురావచ్చు. 

కొన్ని అమరికలు.. కొన్ని జాగ్రత్తలు
►స్ట్రెయిట్, వెర్టికల్‌ గార్డెన్స్‌కి ప్రత్యేకమైన కుండీలు అవసరం. ఇవి మార్కెట్లోనూ, ఆన్‌లైన్‌ మార్కెట్లోనూ అందుబాటులో ఉన్నాయి. 
►మీ గోడను నీటì  చెమ్మ నుంచి కాపాడుకోవాలి. అందుకు గోడను ఫ్లైవుడ్‌ లేదా ఇతరత్రా సెట్‌ చేసుకోవాలి. 
►కింద ఫ్లోర్‌ కూడా తేమ లేకుండా పొడిగా ఉండేలా మ్యాట్‌ వేసుకోవాలి. మీ గ్రీన్‌ వాల్‌కు తగినంత సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. అదనంగా కాంతినిచ్చే ఫ్లోరోసెంట్‌ ట్యూబ్స్‌ను వాడాలి. 

చదవండి: The New York Earth Room: ‘చెత్త’ అపార్ట్‌మెంట్‌ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top