బంజారాహిల్స్‌: హిజ్రాల కోసం వచ్చి కత్తులు చూపి బెదిరించి.. | Two Men Arrested For Attempt To Attack On Hijras At Banjara Hills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌: హిజ్రాల కోసం వచ్చి కత్తులు చూపి బెదిరించి..

Mar 16 2022 1:15 PM | Updated on Mar 16 2022 2:25 PM

Two Men Arrested For Attempt To Attack On Hijras At Banjara Hills - Sakshi

ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని ఆపాలని చూడగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే సిబ్బందితో కలిసి వారు పరారవుతున్న బైక్‌ను ఆపి

సాక్షి, బంజారాహిల్స్‌: హిజ్రాలపై కత్తులు చూపి దాడికి యత్నించిన ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలివీ.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.7లో సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఎస్‌ఐ కృష్ణవేణి పెట్రోలింగ్‌ చేస్తుండగా ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని ఆపాలని చూడగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే సిబ్బందితో కలిసి వారు పరారవుతున్న బైక్‌ను ఆపి తనిఖీలు చేయగా వారి వద్ద ఓ కత్తి దొరికింది.

ఇక్కడ హిజ్రాల కోసం వచ్చిన వీరిద్దరూ కత్తులు చూపి వారిని బెదిరించేందుకు యత్నిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందని ఎస్‌ఐ కృష్ణవేణి పేర్కొన్నారు. వీరి గురించి ఆరా తీయగా ఇందులో ఒకరు చిలకలగూడ జామియా మసీదు సమీపంలో నివసించే ఇమామ్‌(18)తోపాటు రసూల్‌పుర గన్‌బజార్‌కు చెందిన ఓ బాలుడు(17)గా తేలిందన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 25(1) ఆరమ్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు. 
చదవండి: ఏడో తరగతి నుంచి ప్రేమ.. కాదనడంతో టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement