డబ్బు ఆశతో ప్రియుడిని చంపిన ప్రియురాలు

సాక్షి, గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడిని హతమార్చి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఉదంతం చెరుకుపల్లిలో వెలుగు చూసింది. వివరాలు.. గుంటూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటూ శిరీష అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చి రూ. 15 లక్షలు భరణం ఇచ్చేందుకు చిరంజీవి తన మెడికల్ షాపును విక్రయించాడు. ఆ డబ్బు మీద ఆశతో శిరీష చిరంజీవిని చంపాలని నిర్ణయించుకుంది.
అయితే శిరీషకు మరోకరితో కూడా వివాహేతర సంబంధం ఉంది. దీంతో అతడితో కలిసి చిరంజీవిని చంపేందుకు శిరీష పథకం రచించింది. అనుకున్నట్టుగానే ప్రియుడితో కలిసి చిరంజీవిని హతమార్చి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. మృతుడు తండ్రి సుబ్బారావు ఫిర్యాదుతో విషయం వెలుగులో వచ్చింది. చిరంజీవి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శిరీషతో పాటు ఆమె ప్రియుడు భానుప్రకాష్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి