
సాక్షి, విజయవాడ: స్థానిక నోవాటెల్ హోటల్ దగ్గర కారు(AP16BC4534)పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలపాలు కాగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా రియల్ ఎస్టేట్ గొడవల నేపథ్యంలోనే ఘటన జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: అమీన్‌పూర్ ఘటన: రహస్య విచారణ)
వివరాలు.. కృష్ణారెడ్డి, గంగాధర్, నాగమల్లి, వేణుగోపాల్‌రెడ్డి అనే నలుగురు వ్యక్తులు కారులో కూర్చుని ల్యాండ్ విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం తలెత్తడంతో వేణుగోపాల్ రెడ్డి చర్చల మధ్యలోనే కారు నుంచి దిగిపోయాడు. వెంటనే డోర్లన్నీ లాక్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించి.. అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న డీసీపీ హర్షవర్ధన్ రాజు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.