‘జైద్‌ లే నాన్నా.. ఒక్కసారి ఇటు చూడు.. ఎంత పనిచేశావ్‌’

Boy Fell To The Sump And Died In Anantapur District - Sakshi

ఉరవకొండ(అనంతపురం జిల్లా): ‘నాన్నా జైద్‌ కన్నులు తెరు... ఒక్కసారి ఇటు చూడు... లే నాన్నా.. లే.. యా అల్లాహ్‌ ఎంత పనిచేశావయ్యా’ అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఉన్న ఒక్క కొడుకూ చనిపోవడంతో వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. వివరాల్లోకెళితే...  ఉరవకొండ పట్టణంలోని ఇందిరానగర్‌లో జైనుల్లా, యాస్మిన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. జైనుల్లా టెంకాయల వ్యాపారం చేస్తున్నాడు.

చదవండి: అర్ధరాత్రి ఆలయానికి ఎలుగు బంటి.. తాళాలు వేసి ఉండటంతో ఏం చేసిందంటే?

వీరికి ఒక్కగానొక్క కుమారుడు మహ్మద్‌ జైద్‌ (20 నెలలు) ఉన్నాడు. మహ్మద్‌ జైద్‌ గురువారం ఎదురింట్లో ఆడుకోవడానికి వెళ్లాడు. తెరిచి ఉన్న సంప్‌ వద్ద ఆడుతుండగా పొరపాటున సంప్‌లో పడిపోయాడు. ఇంటి పనుల్లో నిమగ్నమైన తల్లి కూడా గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత ఎదురు ఇంట్లో ఉన్న వారు గమనించి వెంటనే సంప్‌లోని నుంచి బాబును బయటకు తీసి హుటాహుటినా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాబు చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించడంతో బాబు తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top