నాలాలో జారిపడి ఐదు కిలోమీటర్లు కొట్టుకునిపోయి.. లోకేష్‌ మృతి

Bengaluru Man Dies After Drowning In Drain - Sakshi

క్రైమ్‌: బెంగళూరులో అండర్‌పాస్‌లో కారు చిక్కుకుపోయి ఇన్ఫోసిస్‌ టెక్కీ భానురేఖ(23) మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే..  రాజధానిలోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఓపెన్‌ నాలాలో జారి పడి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

నాలాలో పడి కొట్టుకుపోయి మృతి చెందిన వ్యక్తిని లోకేష్‌(32గా గుర్తించారు పోలీసులు. నాలా ప్రవాహంలో ఐదు కిలోమీటర్ల దూరం మృతదేహం కొట్టుకుపోగా..  చివరకు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. 

ఆదివారం కెంపపుర ప్రాంతంలో నాలాలోకి లోకేష్‌ జారిపడిపోయాడు. అప్పటికే వర్షంతో నాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో.. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. అలా ఐదు కిలోమీటర్ల దూరం కొట్టుకుని పోగా.. మైసూర్‌ రోడ్‌లోని బైటరాయణపుర వద్ద మృతదేహాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.

అయితే.. లోకేష్‌ నాలాలో దిగే ప్రయత్నంలోనే కొట్టుకునిపోయి ఉంటాడని పోలీసులు చెప్తుండగా, కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల వాదనను కొట్టిపారేస్తూ లోకేష్‌ జారిపడి వరద ఉధృతికి కొట్టుకుపోయాడని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కెంపపుర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. దర్యాప్తు కొనసాగుతోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top