Google vs CCI: గూగుల్‌కు మరో ఎదురుదెబ్బ..కానీ..!

NCLAT upholds CCI penalty on Google but sets aside key directions - Sakshi

న్యూఢిల్లీ:  సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌ మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ)  విధించిన జరిమానాను  సమర్ధించింది. ఆండ్రాయిడ్ మార్కెట్‌లో దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలపై గూగుల్‌పై  విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాను సమర్థించింది. ఈ  పెనాల్టీ మెుత్తాన్ని చెల్లించేందుకు ట్రైబ్యూనల్ గూగుల్‌కు 30 రోజుల పాటు గడువిచ్చింది. అయితే ఈ తీర్పుపై  గూగుల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని  భావిస్తున్నారు.

(ఇదీ చదవండిGold Price March 29th పసిడి రయ్‌​..రయ్‌! పరుగు ఆగుతుందా?)

అయితే మరో భారీ ఊరట కూడా లభించింది.ఎన్‌సీఎల్‌ఏటీ చైర్‌పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్, సభ్యుడు (టెక్నికల్) డాక్టర్ అలోక్ శ్రీవాస్తవతో  కూడిన బెంచ్  సీసీఐ జారీ చేసిన నాలుగు కీలక ఆదేశాలను పక్కన పెట్టింది. సీసీఐ ఆర్డర్‌లోని 617.3, 617.9, 617.10 617.7 పేరాల్లో జారీ చేసిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. అలాగే ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులను(OEM) 11 అప్లికేషన్‌ల మొత్తం Google సూట్‌ను ప్రీ ఇన్‌స్టాల్ చేయమని గూగుల్ కోరడం అన్యాయమని ఎన్‌సీఎల్‌ఏటీ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోర్క్‌లను అభివృద్ధి చేయడం, పంపిణీ చేయడం నుంచి OEMలను నిషేధించే యాంటీ ఫ్రాగ్మెంటేషన్ అగ్రిమెంట్ షరతులను  తప్పుపట్టింది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్‌ టైకూన్‌ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు)

మరోవైపు కంపెనీ ఒప్పందాల కార్యాచరణతో పోటీ యాప్‌లను ముందే ఇన్‌స్టాల్ చేయకుండా నిరోధించ లేదని పేర్కొంది. మార్కెట్‌లో ఆధిపత్యం పొందడమంటే ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడం కాదని, వినియోగదారుల్లో  గూగుల్ ప్రజాదరణ పొందడమని గూగుల్‌ వాదిస్తోంది. సీనియర్ న్యాయవాది అరుణ్ కథ్‌పాలియా Google LLC తరపున వాదించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top