కోల్పోయిన ఆధార్ నెంబర్ తిరిగి పొందడం ఎలా..?

Lost Your Aadhaar card, How You Can Retrieve UID or EID Number Online - Sakshi

వివిద ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు పొందాలంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. కాబట్టి భారత పౌరులు ఆధార్ కార్డును ముఖ్యమైన గుర్తింపు పత్రంగా పరిగిణిస్తారు. 12 అంకెల గల ఈ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) జారీచేస్తుంది. అలాంటి ఆధార్ కార్డు నెంబర్ మర్చిపోతే/ ఎక్కడైన పోయిన ఏమి జరుగుతుంది అనేది ఒకసారి ఊహించుకోండి. దాని గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎవరైనా ఆధార్ కార్డు నెంబర్ మర్చిపోయిన, కార్డు ఎక్కడైనా పోయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు లేదా హెల్ప్ లైన్ నెంబరు ద్వారా ఆన్ లైన్ లో తమ ఎన్ రోల్ మెంట్ నెంబరు లేదా యుఐడీని తిరిగి పొందవచ్చు. అది ఎలా అనేది ఈ క్రింది విదంగా తెలుసుకోండి.

  • https://uidai.gov.in అధికారిక వెబ్ సైట్ కు సందర్శించండి.
  • హోమ్ పేజీలో 'మై ఆధార్' అనే ఆప్షన్ కింద 'ఆధార్ సర్వీసెస్' అనే ఆప్షన్ ఎంచుకోండి.
  • ఇప్పుడు 'Retrieve Lost or Forgotten EID/UID' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • తర్వాత మీ పేరు, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వంటి వివరాలను నమోదు చేయాలి.
  • అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, వెరిఫికేషన్ కొరకు క్యాప్చా ఎంటర్ చేయండి.
  • సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది.
  • మీ మొబైల్లో వచ్చిన ఆరు అంకెల ఓటీపీని నమోదు చేయండి.
  • ఇప్పుడు మీకు యుఐడీ/ ఈఐడీ నెంబరు ఎస్ఎమ్ఎస్ ద్వారా మీ మొబైల్ కు వస్తుంది. ఈ నెంబర్ తో మీరు ఈ-ఆధార్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రజలు కోల్పోయిన ఆధార్ యుఐడీ/ఈఐడీ నంబర్ ను తెలుసుకోవడానికి ప్రజలు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి హెల్ప్ లైన్ నెంబరు '1947'కు డయల్ చేయాల్సి ఉంటుంది.

చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ. 2 లక్షలు మీ సొంతం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top