విమానయాన రంగానికి భారీ ఊరట | India Cuts Airport Fees by 25% for Airlines Iran War | Sakshi
Sakshi News home page

విమానయాన రంగానికి భారీ ఊరట

Apr 8 2026 11:46 AM | Updated on Apr 8 2026 11:57 AM

India Cuts Airport Fees by 25% for Airlines Iran War

ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలు తగ్గింపు

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానశ్రయాలలో వసూలు చేసే ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 3 నెలల పాటు 25 శాతం తగ్గిస్తూ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్‌ఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

రంగంలోకి ఏఈఆర్‌ఏ

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఈఆర్‌ఏ ఈ తాత్కాలిక తగ్గింపును తక్షణమే అమలులోకి తెచ్చింది. రాబోయే మూడు నెలల వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుతం ఛార్జీల తగ్గింపు వల్ల విమానాశ్రయాలకు కలిగే ఆదాయ లోటును భవిష్యత్తులో చేపట్టే టారిఫ్ సమీక్షల ద్వారా సర్దుబాటు చేస్తామని రెగ్యులేటర్ ఏఈఆర్‌ఏ చేసింది.

దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాశ్రయ రుసుములను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ సంస్థలు ప్రస్తుతం రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పాకిస్థాన్ గగనతలంపై నిషేధం ఉండటంతో భారత విమానాలు ఇప్పటికే చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. ఇరాన్ యుద్ధ మేఘాల వల్ల పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాల ఇంధన ఖర్చులు, నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. ‘ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలకు ఇంధనం, సిబ్బంది వేతనాల తర్వాత విమానాశ్రయ, ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ఛార్జీలే అధిక ఖర్చులుగా ఉన్నాయి’ అని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తెలిపింది.

మరోవైపు, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న సానుకూల పరిణామాలు విమానయాన రంగ షేర్లకు ఊపునిచ్చాయి. ఇరాన్‌తో అమెరికా రెండు వారాల యుద్ధ విరమణ ప్రకటించిన వార్తలతో బుధవారం ట్రేడింగ్‌లో ఇండిగో షేర్లు లాభపడ్డాయి. యుద్ధం సద్దుమణిగితే ఇంధన ధరలు దిగివస్తాయన్న ఆశతో ఇన్వెస్టర్లు విమానయాన రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement