కేంద్రానికి రూ.16,517 కోట్ల డివిడెండ్‌ | Govt receives Rs 566 crore as dividend tranches from 3 CPSEs | Sakshi
Sakshi News home page

కేంద్రానికి రూ.16,517 కోట్ల డివిడెండ్‌

Published Fri, Nov 12 2021 4:57 AM | Last Updated on Fri, Nov 12 2021 4:57 AM

Govt receives Rs 566 crore as dividend tranches from 3 CPSEs - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.16,517.24 కోట్ల డివిడెండ్‌ లభించింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రటరీ తుహిన్‌ కాంత పాండే ఈ మేరకు ఒక ట్వీట్‌ చేశారు. తాజాగా సెయిల్‌ నుంచి రూ.483 కోట్లు, మాంగనీస్‌ ఓర్‌ ఇండియా నుంచి రూ.63 కోట్లు, ఎంఎస్‌టీసీ నుంచి రూ.20 కోట్ల డివిడెండ్‌ అందినట్లు తుహిన్‌ కాంత పాండే వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement