
ముంబై: గోద్రెజ్ గ్రూప్‌లో భాగమైన గోద్రెజ్ క్యాపిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకునే దిశగా వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.
బ్యాంకింగ్ సాధనాలు, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్‌మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ తదితర ఆర్థిక సేవలను ఎస్‌బీఐ మరింత విస్తృతంగా అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. రుణాలు పొందడాన్ని మరింత సౌకర్యవంతంగా, సులభతరంగా చేసేందుకు ఈ భాగస్వామ్యం సహాయకరంగా ఉండగలదని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ మనీష్ షా తెలిపారు.