ప్రభుత్వానికి పీఎస్‌యూల డివిడెండ్‌..తాజాగా రూ. 1,203 కోట్లు జమ

Centre Receives Rs 1203 Crore Dividend - Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూల నుంచి డివిడెండ్‌ రూపేణా కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 1,203 కోట్లు అందుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్‌ రూపేణా కేంద్రానికి రూ. 14,778 కోట్లు లభించాయి.

ప్రధానంగా సెయిల్‌ నుంచి రూ. 604 కోట్లు, హడ్కో నుంచి రూ. 450 కోట్లు, ఐఆర్‌ఈఎల్‌ రూ. 37 కోట్లు చొప్పున దశలవారీగా దక్కినట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. ఇతర సంస్థలలో  ఐఆర్‌సీటీసీ రూ. 81 కోట్లు, భారతీయ రైల్‌ బిజిలీ రూ. 31 కోట్లు చొప్పున చెల్లించినట్లు వెల్లడించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top