సమస్యలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

Feb 17 2026 7:44 AM | Updated on Feb 17 2026 7:44 AM

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

భద్రాచలంటౌన్‌: సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వినతులు ఇచ్చే గిరిజనుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏపీఓ బి.రాహుల్‌ అధికా రులకు సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయ న ఆర్జీలు స్వీకరించాక మాట్లాడుతూ.. ప్రతీదరఖా స్తును ఆన్‌లైన్‌ చేయడంతో పాటు ప్రత్యేకరిజిస్టర్‌లో నమోదుచేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా పోడు భూములకు విద్యుత్‌, ట్రైకార్‌ రుణాలు, రోడ్లు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, వైద్య సాయం వంటి అంశాలపై వినతులు వచ్చాయని వివరించారు. పూసుకుంటకు చెందిన వారు ఇందిరమ్మ ఇంటి బిల్లుల కోసం, బొజ్జా తండా వారు విద్యుత్‌ సమస్య, లక్ష్మీపురానికి చెందిన వారు పోడు పట్టాల కోసం వినతులు ఇచ్చారని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశామని చెప్పారు.

అధికారులు సమయపాలన పాటించాలి

ఐటీడీఏకార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బం ది సమయపాలన పాటించాలని పీఓ రాహుల్‌ ఆదేశించారు.నూతనంగా ఏర్పాటుచేసిన బయోమెట్రిక్‌ హాజ రు నమోదుయంత్రాన్ని పరిశీలించి మాట్లాడారు. అధి కారులు, సిబ్బంది ఉదయం, సాయంత్రం తప్పనిసరి గా బయోమెట్రిక్‌ ద్వారా హాజరు నమోదు చేయాలని, యాప్‌లో తమపేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విధుల్లోనిర్లక్ష్యం వహిస్తేచర్యలు తప్పవని హె చ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ డేవిడ్‌రాజ్‌, ఏఓ రాంబాబు, ఈఈశంకరాచార్యులు, వేణు, ఆది నారాయణ, రాజేష్‌,రామ్‌కుమార్‌ పాల్గొన్నారు.

గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement