అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం | - | Sakshi
Sakshi News home page

అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

Feb 17 2026 7:44 AM | Updated on Feb 17 2026 7:44 AM

అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

ఇల్లెందు: ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని అధిష్టానమే నిర్ణయించి సీల్డ్‌ కవర్‌లో పంపిస్తుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నుంచి ఇల్లెందుకు వచ్చిన కౌన్సిలర్లతో సమావేశమైన ఆయన మాట్లాడారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకుని, అధిష్టానం ప్రకటించిన చైర్మన్‌ అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని సూచించారు. ఈ సందర్భంగా 1వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి సైదామియా, 22వ వార్డు నుంచి గెలిచిన ఇండిపెండెంట్‌ అభ్యర్థి కొర్లపాటి శివకిరణ్‌ కాంగ్రెస్‌లో చేరగా ఆయన ఆహ్వానించారు. దీంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ కౌన్సిలర్ల సంఖ్య 21కి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement