బాపట్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీపై రాజకీయపార్టీల నాయకులతో కలెక్టర్ గురువారం స్థానిక కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ వరకు ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీ విధానం కొనసాగుతుందని చెప్పారు. జూలై 21న డ్రాఫ్ట్ రోల్ ప్రకటిస్తామని, నంబర్ 18వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 22న తుది జాబితాకు చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న మూడు నెలలు సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ సమర్థంగా నిర్వహించడానికి యంత్రాంగం ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 65.5శాతం పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. ఓటు హక్కుకు ఆధార్ కార్డు ఒకటే ప్రామాణికం కాదని, 13 రకాల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయన్నారు. ఓటర్ల విచారణ ప్రక్రియకు బీఎల్వోలు వస్తే మీ ధృవీకరణ పత్రాలు చూపాలన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియపరచాలన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్, రాజకీయ పార్టీల నాయకులు రామకృష్ణ, గంగయ్య, రవి, మాల్యాద్రి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


