నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రిమాండ్‌

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

బాపట్ల: బైండోవర్‌ బాండ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 30 రోజులు రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. స్టూవర్టుపురం గ్రామానికి చెందిన అంగడి చంద్రబాబుపై 11 కేసులు ఉన్నాయి. 30 రోజులు రిమాండ్‌, రూ. రెండు లక్షలు జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌ మాట్లాడుతూ... బైండోవర్‌ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి జిల్లా బహిష్కరణ విధించడానికి కూడా వెనుకడబోమని హెచ్చరించారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 112కు కాల్‌ చేసి అందరూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement